న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రోజు నగరంలోని రామకృష్ణ విద్యానికేతన్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు రాజ్యాంగం భారతీయుల ఆత్మ రాజ్యాంగాన్ని తెలుసుకుంటే బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు స్వేచ్ఛ, సమానత్వం అందించిన భారత రాజ్యాంగం భారతీయుల ఆత్మ అని ఇందూర్ జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ చెప్పారు.
హక్కులు, విధులతోపాటు బాధ్యతలను, కర్తవ్యాలను కూడా రాజ్యాంగం అందించిందన్నారు శివాజీ నగర్ లోని శ్రీరామకృష్ణ విద్యానికేతన్ హైస్కూల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి డాక్టర్ అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని రూపొందించారని జగన్మోహన్ గుర్తు చేశారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో పౌరులు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కూడా అవసరమని చెప్పారు.
కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన కార్యవర్గ సభ్యుడు బండారి కృష్ణానంద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారని చెప్పారు.
Qకార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠిక చదివింప ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసచార్యులు, ప్రిన్సిపల్ శశిరేఖ, మధుసూదనాచార్యులు, మాధురి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
