రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడం వల్లే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జాప్యం అవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.
బుదవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి అధికారులతో సమీక్షించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
జిల్లాలోని మాధవనగర్,మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వీబీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.కోట్లల్లో నిధులు రావాల్సి ఉందని తెలిపారు.
ఈ నిధుల కోసం వారం రోజుల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తానని పేర్కొన్నారు.ప్రధానంగా మాధవనగర్ కు సంబంధించి రూ.3 కోట్లు, రివైజ్డ్ నిధులు రూ.8.5కోట్లు పెండింగ్లో ఉన్నాయని,అలాగే అర్సపల్లి ల్యాండ్కు సంబంధించి సుమారు రూ.10 కోట్లు ఉన్నాయన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రినీ కలుస్తానని ఆయన స్పష్టం చేశారు.
