HomeSportsయువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండేది..పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ..

యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండేది..పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ..

యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ శాఖ ఆద్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ మైదానం యందు 26 టీం లను ఏర్పాటు చేశారు.

కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ” భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరముగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొని , ఆటలో స్పూర్తిని చూపించినందులకు ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు , మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా , మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలన్నారు.

ఈ రోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోంది. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే , జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. యువత దేశ భవిష్యత్తు, మీరు ఆరోగ్యంగా ఉంటూ , మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి.

మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయి. మన బాధ్యతలు మనమే గుర్తించాలి. మంచి స్నేహితులను , మంచి అలవాట్లను ఎంచుకోవాలి. మీరు చేసిన ప్రతి మంచి పని , మీ కుటుంబాన్ని , సమాజాన్ని గర్వపడేలా చేస్తుంది.

ఈ సందర్బంగా పోలీస్ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించినటువంటి దానిలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రధానము చేయడం జరిగింది.

అనంతరం క్రీడాకారులకు బహుమతుల ప్రధానము పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్ , బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ, రుద్రూర్ సి. ఐ కృష్ణ, ఎడపల్లి ఎస్. ఐ రమా , బోధన్ రూరల్ ఎస్. ఐ. మచ్చేందేర్ రెడ్డి , రెంజల్ ఎస్. ఐ చంద్ర మోహన్ , కోటగిరి ఎస్. ఐ సునీల్, బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments