ఎన్నికల విధులకు గైర్హాజర్ అయిన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్ లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్.ఓ)గా హెచ్.ఎం వనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
అయితే ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజర్ అయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి వచ్చింది.
ఈ విషయమై ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియతో విచారణ జరిపించి నివేదిక తెప్పించుకున్న కలెక్టర్, ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
