HomeTelanganaNizamabadమొదలైన నామినేషన్ల కోలాహలం!తొలిరోజు సుమారు 15 నామినేషన్ల దాఖలు..నగరవ్యాప్తంగా 20 కేంద్రాల ఏర్పాటు

మొదలైన నామినేషన్ల కోలాహలం!తొలిరోజు సుమారు 15 నామినేషన్ల దాఖలు..నగరవ్యాప్తంగా 20 కేంద్రాల ఏర్పాటు

నగరపాలక సంస్థ ఎన్నికల నగారా మోగడంతో నిజామాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది.

తొలిరోజు కావడంతో ప్రధాన పార్టీల కంటే స్వత్రంత్ర ఆశావహులే ఎక్కువగా నామినేషన్ కేంద్రాల బాట పట్టారు.నిజామాబాద్ లో మొత్తం 60 డివిజన్ లలో నామినేషన్ల స్వీకరణ కోసం యంత్రాంగం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 20 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఈమేరకు సాయంత్రం సమయానికి నగర వ్యాప్తంగా సుమారు 12 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.

తొలిరోజు కొందరు నామినేషన్లు వేసినప్పటికీ, అసలైన జోరు రాబోయే రెండు రోజుల్లోనే ఉండబోతోంది. మంచి ముహూర్తాలు ఉన్నాయని భావిస్తున్న గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు ప్లాన్ చేసుకుంటున్నారు.

‘బి-ఫారం’ల సస్పెన్స్.. అభ్యర్థుల్లో టెన్షన్ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు ఇంకా తమ అభ్యర్థుల తుది జాబితా లేదా ‘బి-ఫారం’లను అధికారికంగా ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో ఒక్కో డివిజన్ నుంచి నలుగురు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కొందరు నేతలు.. బుధవారం నామినేషన్లు దాకాలు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments