శనివారం తెల్లవారుజామున నిజామాబాదు నగరంలో ఏటియం లచోరీ లు జరిగిన ప్రాంతాలను ఇంచార్జ్ కమిషనర్ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు ఏటీఎంల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, చోరీ జరిగిన విధానం, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను అధ్యయనం చేశారు.
సీసీటీవీ ఫుటేజ్ సేకరణ: ఏటీఎం లోపలి మరియు పరిసర ప్రాంతాల సీసీటీవీ దృశ్యాలను సేకరించి విశ్లేషణకు ఆదేశించారు.ప్రత్యేక బృందాల ఏర్పాటు: క్లూస్ టీమ్, సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీస్ బృందాలతో మరియు 5 ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు.పెట్రోలింగ్ పెంపు: రాత్రి వేళల్లో ముఖ్యంగా ఏటీఎంలు, బ్యాంకులు, జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ పెట్రోలింగ్ పెంచారు.
నిఘా కట్టుదిట్టం: జిల్లా లో ప్రవేశ–నిష్క్రమణ పాయింట్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.బ్యాంకులతో సమన్వయం: ఏటీఎం భద్రతను బలోపేతం చేయడానికి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసుకొని అలారం వ్యవస్థలు, అదనపు సీసీటీవీలు, లైటింగ్ మెరుగుదలపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి.బస్వారెడ్డి , నిజామాబాదు ఏసిపి రాజా వెంకటరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, 4 టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్ , టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, 4 టౌన్ ఎస్ఐ శగంగాధర్ మరియు బ్యాంక్ మేనేజర్ శ్రీ శివకుమార్ తదితరులున్నారు
