HomeCRIMEకబ్జా ల ఫై కదిలిన యంత్రాంగం ........ఆక్రమణల కూల్చివేత .........అధికార పార్టీ నేత చెర వీడిన...

కబ్జా ల ఫై కదిలిన యంత్రాంగం ……..ఆక్రమణల కూల్చివేత ………అధికార పార్టీ నేత చెర వీడిన భూమి

ప్రభుత్వ భూముల కబ్జాల ఫై యంత్రాంగం ఎట్టకేలకు మొద్దు నిద్ర వీడింది. కోట్లాది రూపాయల విలువైన భూములు యథేచ్ఛగా వెలిసిన అక్రమ నిర్మాణాలను గురువారం కూల్చేశారు.

మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు మూకుమ్మడిగా వెళ్లి కూల్చివేతలు చేపట్టారు. అధికార పార్టీ ముసుగు లో ఓ మాజీ కార్పొరేటర్ గత కొన్నేళ్లుగా ప్రభుత్వ భూములను చెరబట్టి నాన్ లే అవుట్ ప్లాట్ లు చేసి అమాయక ప్రజలకు కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ ప్రాంతంలో భూకబ్జా ల మీద పిర్యాదు లు వెల్లువెత్తిన అధికారులు కనీసం పట్టించుకోలేదు. సదరు నేతఅధికార పార్టీకి చెందిన ఓ అగ్ర నేత నీడలో ఉండడంతో చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడరు.

అగ్ర నేత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు కఠినచర్యలకు సిద్ధం అయ్యారు. అర్సపల్లి శివారులో గల ధర్మపురి హిల్స్ రోడ్డు ప్రక్కన ,సర్వే నెంబర్ 249, 250, 251, సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిఉంది.

గతంలో ఇదే ప్రాంతంలో తెలంగాణ యునివర్సిటీ ఏర్పాటు కోసం సిద్ధం చేసారు.కాలక్రమేని ఈ భూములు అధికార పార్టీ నేతలకు బంగారు బాతు గా మారాయి. అధికారంలో ఎవరున్నా సరే ఈ ప్రాంతంలో భూముల అన్యాక్రాంతం చేయడం ఆనవాయితీ మారింది.

ఓ మాజీ కార్పొరేటర్ అధికార పార్టీ అండ ఇదే కార్యానికి తెరలేపారు. దాదాపు ఎకరం కు పైగా భూమి ని దీని విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు కోటి రూపాయలు వుంటుంది.భూమిని చదును చేసి ప్లాట్ లుగా మార్చేసి అమ్మేసారు.

ప్లాట్ లు కొనుగోలు చేసిన వారు ఇండ్లు ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఈ భూమిలో రేకుల షెడ్లతో వ్యాపార కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నారు. స్థానికులు యంఐయం నేతలు అనేక మార్లు పిర్యాదు లు చేసారు ప్రజావాణి లోనూ పిర్యాదు వచ్చాయి.

దీనిపై గత కొద్దీ రోజుల క్రితమే రెవెన్యూ అధికారులు వెళ్లి ఫీల్డ్ సర్వే చేసి కబ్జా ను నిర్దారించారు.ఉత్తర మండల తాసిల్దార్ విజయకాంత్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ఆరో టౌన్ పోలీస్ సిబ్బంది.తో వెళ్లి జేసీబీ లతో ఆక్రమణలను కూల్చేశారు.రేకుల షెడ్లు తొలగించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments