అతను ఒకప్పుడు సాధారణ సెల్‌ఫోన్ రిపేరర్.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. కానీ, అతి తక్కువ కాలంలోనే నేర ప్రపంచంలో నంబర్ వన్‌గా ఎదిగాడు. నాగారం ప్రాంతానికి చెందిన సదురు కరుడుగట్టిన మట్కా కింగ్ నిజామాబాద్ జిల్లా కేంద్రాన్ని అడ్డాగా మార్చుకుని ఏకంగా అంతర్రాష్ట్ర మట్కా సామ్రాజ్యాన్ని శాసించే ‘కింగ్ మేకర్’ అయ్యాడు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన .
టెక్నాలజీని వాడుకుంటూ, పోలీసుల కళ్లు గప్పుతూ.. కాదు కాదు, కొందరు ఖాకీల అండదండలతోనే నిరాటంకంగా కోట్లాది రూపాయల లావాదేవీలు సాగిస్తున్నారు. ఇంతటి భారీ సామ్రాజ్యాన్ని నిర్మించడం వెనుక నగరంలోని ‘పోలీస్ లైన్’కు చెందిన ఒక కీలక వ్యక్తి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
సదరు వ్యక్తికి పోలీసు శాఖ లో నే కాదు రాజకీయ పార్టీల్లో ను అండదండ ఉండే నేతలు పుష్కలంగా ఉన్నారు ఉన్న పరిచయాలు, అందుతున్న ‘నెలవారీ నజరానాలే’ఆయన కు రక్షణ కవచంగా మారాయనే వాదనలు ఉన్నాయి . “మేము పైస్థాయిలోనే మేనేజ్ చేస్తున్నాం,పెద్ద స్థాయిలో .
రాజకీయ నాయకుల ఆశీస్సులు,న్నాయి కొందరు పోలీసులు అంత కఠినంగా వుండే ఛాన్స్ లేదనే సదరు మట్కా కింగ్ తన వద్ద ఈ దందా పనిచేసే వారికి భరోసా ఇస్తారు.అన్నట్లుగానే పోలీసులకు చిక్కకుండా ఈ మట్కా,బెట్టింగ్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించగలిగాడని స్థానికులు కోడై కూస్తున్నారు.
దందా కేవలం నిజామాబాద్ లేదా తెలంగాణ సరిహద్దులకే పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఈయనకు బలమైన నెట్‌వర్క్ ఉంది. నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధా, అకోలా, అమరావతి తదితర ప్రాంతాల మట్కా నిర్వాహకులతో జమీర్‌కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
ప్రతి రోజు ప్రధాన కేంద్రాల నుండి ‘విజేత’గా రాబోయే లక్కీ నంబర్లను ముందే సేకరించి, వాటి ఆధారంగా ఏజెంట్లు, బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగులు కాసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నట్లు సమాచారం. గతంలో మట్కా అంటే రహస్య ప్రాంతాల్లో చీటీల రూపంలో ఆడేవారు.
కానీ సాంకేతికత పెరగడంతో జమీర్ తన పాత ‘సెల్‌ఫోన్ రిపేరింగ్’ తెలివితేటలను ఇక్కడ వాడాడు. ఇంటర్నెట్, వాట్సాప్, ఇతర డిజిటల్ వేదికల ద్వారా ఈ దందాను పూర్తిగా హైటెక్‌గా మార్చేశాడు. నగరంలోని ఎన్నారై కాలనీకి చెందిన వ్యక్తి, చంద్రశేఖర్ కాలనీకి , నాగారానికి చెందినటువంటి అనుచరులు, ఇతర ఏజెంట్లను రంగంలోకి దించి, యువతకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తామనే అత్యాశ చూపిస్తున్నాడు.
వారి ద్వారా నిత్యం లక్షలాది రూపాయల కలెక్షన్లు డిజిటల్ రూపంలోనే జరిగిపోతున్నాయి. కేవలం మట్కా దందాతోనే ఆగిపోలేదు. దీనికి తోడుగా సంవత్సరం పొడవునా జరిగే క్రికెట్ మ్యాచ్‌లపై భారీ ఎత్తున బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు ప్రపంచంలో ఎక్కడ ఏ లీగ్ మ్యాచ్ జరిగినా తన అడ్డాలో బెట్టింగ్ మార్కెట్ ఓపెన్ అవుతుంది.
అధునాతన ఆన్‌లైన్ యాప్స్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను వాడుకుంటూ వందలాది మంది యువకులను ఈ క్రికెట్ జూదం వైపు లాగుతున్నాడు. మట్కా ద్వారా వచ్చే నల్లధనాన్ని ఈ క్రికెట్ బెట్టింగుల్లోకి మళ్లిస్తూ రోజుకు కోట్ల రూపాయల టర్నోవర్ సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మట్కా,బెట్టింగ్ రొంపిలో పడి నిజామాబాద్‌లోని వందలాది పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కూలీలు, యువకులు సంపాదనంతా తన ముఠా చేతుల్లో పెట్టి ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు.
అప్పుడప్పుడు పోలీసులు ఒకరిద్దరు చిన్న ఏజెంట్లను పట్టుకుంటున్నప్పటికీ, అసలు డొంక కదలడం లేదు. గతంలో ఈ ముఠా పెద్ద ఎత్తున లావాదేవీలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పటికీ..
అప్పటి టాస్క్‌ఫోర్స్ అధికారులు భారీగా ముడుపులు పుచ్చుకుని, కేవలం చిన్న చిన్న సెక్షన్లతో నామమాత్రపు కేసులు బనాయించి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఉదాసీనతే మట్కా కింగ్ ను ఈరోజు అంతర్రాష్ట్ర డాన్‌ను చేసింది.
