HomeTelanganaNizamabadవరి ధాన్యాన్ని తరుగు లేకుండా, మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని AIUKS డిమాండ్..

వరి ధాన్యాన్ని తరుగు లేకుండా, మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని AIUKS డిమాండ్..

అఖిలభారత ఐక్య రైతు సంఘం. AIUKS నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడానికి ప్రయత్నించగా అందుబాటులో లేకపోవడంతో. అడిషనల్ కలెక్టర్, DSO గార్లను కలిసి నిజామాబాద్ డివిజన్, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో రైతులు కొనుగోలు కేంద్రం చుట్టూ తమ వద్దన్న ధాన్యాన్ని,, మొక్కజొన్నను వెంటనే తరలించాలని కోరుతున్న ప్రయోజనం లేదని లారీలు ఉంటే కాళీ బస్తాలు ఉండడం లేదు అని, అన్నీ ఉంటే రైస్ మిల్ యజమానులు సన్నధాన్యం క్వింటాలకు 12 కిలోల తరుగు అట్లాగే 500 సంచుల లారీకి 40 కిలోల తరుగు సంచి ఇవ్వాలని కొన్ని రైస్ మిల్ యజమానులు అడుగుతున్నా, మరికొందరురైతులు అడగకుండానే తీసుకుంటున్న విషయాలు సైతం అధికారుల దృష్టికి తీసుకొచ్చిన విషయంపై ఈరోజు అనగా 19 మే రోజున నిజామాబాద్ జిల్లా కేంద్రమైనఎన్ ఆర్ భవన్ పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించడం జరిగింది..

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి. B. దేవరాం మాట్లాడుతూ రోడ్లపైన, కల్లాలపైన కుప్పలు తెప్పలు దాన్యం, మొక్కజొన్న దర్శనమిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా అధికారులకు అనేక సార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని చివరికి రైస్ మిల్ ఎదురుగా ధర్నాలు చేసిన పట్టించుకోవడంలేదని ఒకవైపు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రతి గింజ కొనుగోలు చేస్తాం తరుగు లేకుండా అని ఉపన్యాసాలు ఇస్తు గొప్పలు చెప్పుకుంటున్నారు.

మరోవైపు రైతు లబోదివ ముట్టుకుంటున్న పట్టించుకునే నాథుడే లేదని తీవ్రంగా విమర్శించారు. జక్రాన్పల్లి సహకార సంఘ పరిధిలోని పుప్పాలపల్లి గ్రామ రైతులు శ్రీకృష్ణ ఆగ్రో ట్రేడింగ్ కాలూరు మిల్లుకు తీసుకువెళ్తే క్వింటాలకు 11 కిలోలు తరుగు తీసుకోగా 40 కిలోల సంచి అదనంగా తీసుకొని ట్రక్ షీట్లో పేర్కొనడం జరిగింది కనీసం రైతుకు సమాచారం లేదు అని అట్లాగే రావట్ల IKP కేంద్రం నుంచి సాయి రాజలక్ష్మి ఇండస్ట్రీ గుండారం నాలుగు రోజులవుతుంది లారీ తీసుకవెల్లి కనీసం దించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు మొక్కజొన్న ఎకరానికి దిగుబడి వచ్చినంత కాకుండా తక్కువ కొనుగోలు చేయడం అనేది దళారి వ్యాపారు సహకారం చేయడమే ప్రభుత్వ విధానంగా మారిందని ఎద్దేవ చేశారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి, భా జన్న గారి బాబన్న.. సారా సురేష్ లు మాట్లాడుతూ అకాల వర్షాలతో భయపడి కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంతోని అధికారుల నిర్లక్ష్యంతోని రైస్ మిల్ యజమానుల అధిక జరుగు భయానికి దళారీ వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకునే స్థితికి ప్రభుత్వఅతిస్తుందని విమర్శించారు..

ఒకవైపు రైస్ మిల్ యజమానులు అన్లోడ్ చేసుకోమని మురాయిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నట్లు అనిపిస్తుందని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుట్టి నాగన్న మాట్లాడుతూ మొక్కజొన్న దిగుబడి వస్తే అంత కొనుగోలు చేయాలని తరుగు లేకుండా ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. తరువు లేకుండా లారీలను, ఖాళీ సంచులను ఎలాంటి ఇబ్బందులుగా కాకుండా యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకోవాలని..

కలెక్టర్గారు స్పందించాలని గుర్తు చేశారు.. ఉద్యమ అభినందనలతో…అఖిలభారత ఐక్య రైతు సంఘం..AIUKS.నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ. అధ్యక్షులు. ప్రధాన కార్యదర్శి.సారా సురేష్. బా జన్న గారి బాబన్న

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments