నిజామాబాద్ నగరానికి చెందిన జక్కగురు మెహన్ చరణ్ ఏంసెట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబర్చి తెలంగాణ రాష్ట్ర స్థాయిలో 369వ ర్యాంక్ . ఎంపీసీ విభాగంలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం ద్వారా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థి కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
మెహన్ చరణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు. ఆయన సాధించిన విజయంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మర్రి కిరణ్, డి. వెంకట్ రమణ గౌడ్, ఎక్స్ జి.పీ. లాయర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
