సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దాన్ని బెల్లం తయారీ కేంద్రంగా మార్చి ప్రభుత్వం నడిపించాలని డిమాండ్ చేస్తూ చెరుకు ఉత్పత్తిదారులసంఘం ఆధ్వర్యంలో 19-5 -2026న జిల్లా కేంద్రంలో ఆకుల పాపయ్య అధ్యక్షతన ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు శ్రీ గడుగు గంగాధర్ మాట్లాడుతూ దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉందని చెక్కర ఉత్పత్తి కాకుండా ఈ ప్రాంత రైతుల డిమాండ్ మేరకు చక్కెర ఫ్యాక్టరీని బెల్లం ఫ్యాక్టరీగా మార్చేందుకు గాను ప్రభుత్వానితో మాట్లాడేందుకు నేను వారధిగా ఉంటానని రైతులకు న్యాయం చేయడానికి మా కమిషన్ ఉందని వారు అన్నారు.
గత పాలకుల పాపమే ఈ ఫ్యాక్టరీ మూల పడిందని వారన్నారు ఇప్పుడు రైతులు ఇప్పుడు రైతులు చెరుకు పండించేందుకుగానను ముందుకు వస్తున్నందున ప్రభుత్వ పెద్దలతో, స్థానిక శాసనసభ్యులతో పిసిసి ప్రెసిడెంట్ తో మిమ్మల్ని కల్పించి చర్చించే విధంగా అంతిమంగా బెల్లం తయారు కేంద్రంగా మార్చేందుకు గాను నా వంతు కృషి చేస్తా అని గడుగు గంగాధర్ తెలిపారు.
ఇటీవల మా కమిషన్ గద్వాల,ములుగు జిల్లాలో రైతులను మోసం చేసిన విత్తన వ్యాపారుల మోసాలను అరికట్టి వారి నుండి రైతులకు రావాల్సిన బకాయిలు రూపాయలు 4 కోట్లు ఇప్పించామని ఆయన అన్నారు. రైతులలు కష్టపడి పంటలు పండిస్తేనే నాలుగు మెతుకులు నోట్లోకి వెలుతాయి అని అన్నారు.
అందుకు మీరు జరుపుతున్న పోరాటాలకు ఎప్పుడు మా రైతు ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఆకుల పాపయ్య లక్ష్మారెడ్డి సిర్పూర్ గంగారెడ్డిని మాట్లాడుతూ ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు గాను ఈ ప్రాంత రైతులతో తగిన పోరాట కర్తవ్యాలను రూపొందించుకుంటామని అన్నారు.
దశలవారీగా పోరాట కార్యక్రమం చేపడతామని ముందుగా సంతకాల సేకరణతో స్థానిక శాసనసభ్యులకు మెమోరాండాలతో ప్రారంభిస్తామని అంతిమంగా పెద్ద ఎత్తున రైతు ఉద్యమం తీసుకువస్తామని ఫ్యాక్టరీని తేరిపించి బెల్లం కేంద్రంగా మార్చేంత వరకు రైతు పోరాటాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.
ఇంకా ఈ సమావేశంలో పృథ్వీరాజ్ ,నాగయ్య, వేల్పూర్ భూమయ్య, గంగారెడ్డి, సాయ రెడ్డి, బన్సీ, రాధాకృష్ణ గౌడ్, దేవన్న, శ్రీధర్, కొట్టే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
