ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి, రీసైక్లింగ్ చేస్తున్న బోధన్‌లోని ప్రముఖ ‘ప్రభాకర్ రైస్ మిల్లు’పై మరోసారి విజిలెన్స్, పోలీస్ అధికారులు ఉమ్మడిగా మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో మిల్లు ఆవరణలో అక్రమంగా లోడ్ చేసి ఉన్న రెండు డీసీఎంల రేషన్ బియ్యాన్ని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని సీజ్ చేశారు.అధికారుల కళ్లు గప్పి పీడీఎస్ బియ్యం దందా సాగిస్తున్న ఈ ప్రభాకర్ రైస్ మిల్లుపై దాడులు జరగడం, బియ్యం పట్టుబడటం ఇది మూడోసారి (3వ సారి) కావడం గమనార్హం.
గతంలో రెండుసార్లు అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినప్పటికీ, మిల్లు నిర్వాహకులలో ఎలాంటి మార్పు రాలేదని, పాత పద్ధతిలోనే అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని స్పష్టమవుతోంది.
పదే పదే చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడుతున్న ఈ మిల్లు వ్యవహారం ఇప్పుడు నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
