ఓటర్ లిస్ట్ తయారీ బూత్ లెవెల్ అధికారులు చేస్తున్న సర్వేను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ప్రత్యేక సమ్మరీ రెవిజన్ లో భాగంగా జరుగుతున్న ఓటర్ లిస్ట్ తయారీ 2025 బూత్ లెవెల్ అధికారులు ఇంటింటి సర్వేను చేస్తున్నారు.
అందులో భాగంగా శుక్రవారం ఉదయం సర్వే ను మున్సిపల్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.
18 సంవత్సరాలు నిండినవారు ఓటును నమోదు చేసుకోవాలని యువతను కోరారు. అలాగే మరణించిన వారి ఓటరు నమోదు వివరాలు అందజేసి సరైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాల్సిందిగా కోరారు.
అదేవిధంగా నియోజకవర్గాన్ని మార్చిన వారితో సహా కొత్తగా అర్హత కలిగిన ఓటర్లను జోడించడం ద్వారా న్యాయమైన మరియు పారదర్శకమైన ఓటింగ్ ప్రక్రియను సమర్థించడం లక్ష్యంగా పెట్టుకుంది.
