HomeCRIMEసైబర్‌ నేరాల దర్యాప్తులో వేగం పెంచాలి

సైబర్‌ నేరాల దర్యాప్తులో వేగం పెంచాలి

సైబర్‌ నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని హైదరాబాద్‌ నగర నేరాలు, సిట్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు.

భారీ మొత్తాల్లో నగదు నష్టపోయిన సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి.. పోయిన సొమ్మును వీలైనంత త్వరగా రికవరీ చేయాలని సూచించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ నెల 7న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ యూనిట్‌ను అదనపు పోలీస్‌ కమిషనర్‌ తనిఖీ చేశారు. యూనిట్‌ పనితీరు, పెండింగ్‌ కేసులు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విభాగం, 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ స్పందన, సిబ్బంది కేటాయింపులపై సమీక్ష నిర్వహించారు.

కేసుల నిరూపణ శాతం పెంచేందుకు డిజిటల్‌ సాక్ష్యాలను పక్కాగా సేకరించి, చట్టపరమైన డాక్యుమెంటేషన్‌ చేపట్టాలని సూచించారు. బాధితుల నుంచి మోసపూరితంగా బదిలీ అయిన నగదును వెంటనే ఫ్రీజ్‌ చేయడంతోపాటు తిరిగి రాబట్టేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సమన్వయం మరింత బలోపేతం చేయాలన్నారు. *కొత్త తరహా మోసాలపై అప్రమత్తం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత స్కామ్‌లు, నకిలీ పెట్టుబడి యాప్‌లు, ఇతర కొత్త తరహా సైబర్‌ మోసాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

పెండింగ్‌ కేసులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. సైబర్‌ నేరాల నియంత్రణకు తక్షణ దర్యాప్తు, నగదు రికవరీ, పక్కా డిజిటల్‌ ఆధారాల సేకరణ, ప్రజల్లో అవగాహన కీలకమని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments