HomeCRIMEభీంగల్‌ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదు..

భీంగల్‌ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదు..

భీంగల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సోమవారం ఉదయం ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది.

భీంగల్‌కు చెందిన పి.సుధాకర్‌ పాత బస్టాండ్‌లో టీ దుకాణం నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో పెట్రోల్‌ బాటిల్‌, అగ్గిపెట్టెతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన అతడు ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

అక్కడే ఉన్న పోలీసులు, ఫిర్యాదుదారులు వెంటనే మంటలను ఆర్పి అతడిని నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుధాకర్‌ టీ దుకాణానికి ఎదురుగా ఉన్న కిరాణా దుకాణంలో సిగరెట్లు కొనడం లేదనే విషయంలో వివాదం ఉన్నట్లు తెలిసింది.

తనపై ఇద్దరు రిపోర్టర్లను పంపించి బెదిరించారని సుధాకర్‌ భావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు రాత్రి వేళల్లో దుకాణం నిర్వహిస్తున్నందుకు విధుల్లో భాగంగా పోలీసులు అతడిపై చిన్న కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన సుధాకర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు పోలీసు వ్యవస్థకు గానీ, సుధాకర్‌కు గానీ ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments