HomeCRIMEఅడవిలో అటవీ సిబ్బంది గస్తీవన్యప్రాణి వారోత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

అడవిలో అటవీ సిబ్బంది గస్తీవన్యప్రాణి వారోత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టింది. వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి అటవీ రేంజ్‌లో సోమవారం పక్షుల పరిశీలనతో పాటు అడవిలో గస్తీ నిర్వహించారు.సిర్నాపల్లి జలపాతం పరిసరాల్లో అటవీ సిబ్బంది పక్షుల కదలికలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వివిధ జాతుల పక్షుల ఆవాసాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. అడవుల్లో జీవవైవిధ్యాన్ని కాపాడటంలో పక్షులు, ఇతర వన్యప్రాణుల పాత్ర కీలకమని అధికారులు తెలిపారు.అనంతరం నల్లవెల్లి బీట్‌లోని అటవీ ప్రాంతంలో సిబ్బంది కాలినడకన గస్తీ నిర్వహించారు.

అడవిలో వన్యప్రాణుల సంచారం, వాటి ఆవాసాల పరిస్థితిని పరిశీలించడంతో పాటు అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పర్యవేక్షణ చేపట్టారు.

అడవుల పరిరక్షణలో స్థానికుల సహకారం కూడా అవసరమని ఎఫ్‌ఆర్‌ఓ రవిమోహన్‌ భట్‌ పేర్కొన్నారు.కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ రాకేష్‌, సెక్షన్‌ ఆఫీసర్లు సురేందర్‌, ప్రభాకర్‌, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments