HomeCRIMEనార్కోటిక్స్‌ దాడి.. కల్లు దుకాణాలు ఖాళీ!ఇద్దరి అరెస్టుతో ఉలిక్కిపడ్డ నిర్వాహకులు..

నార్కోటిక్స్‌ దాడి.. కల్లు దుకాణాలు ఖాళీ!ఇద్దరి అరెస్టుతో ఉలిక్కిపడ్డ నిర్వాహకులు..

సమాచారం అందగానే దుకాణాలకు తాళాలు.దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, భిక్కనూరులోనూ ఇదే పరిస్థితి..నార్కోటిక్స్‌ పోలీసుల ఆకస్మిక దాడులతో కామారెడ్డి పట్టణంలోని కల్లు డిపోల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులు ఎక్కడ తనిఖీలు చేపడతారో తెలియక నిర్వాహకులు ఉరుకులు పరుగులు పెట్టారు. కల్లు డిపో పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బాలాగౌడ్, జీవన్‌గౌడ్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఈ విషయం మిగిలిన డిపోలకు చేరడంతో పలుచోట్ల నిర్వాహకులు ముందుగానే దుకాణాలకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కల్లు డిపో పరిధిలో నార్కోటిక్స్‌ పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు.

దుకాణాలను పరిశీలిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యల విషయం సెకండ్‌ డిపోలోని నిర్వాహకులకు చేరడంతో అక్కడి దుకాణాలు ఒక్కసారిగా మూతపడ్డాయి. అక్కడి నుంచి సమాచారం ఫస్ట్‌ డిపోకు చేరడంతో నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. ఫస్ట్‌ డిపోలో పోలీసులు తనిఖీలకు చేరుకునేలోపే పలు దుకాణాలకు తాళాలు పడిపోయాయి.

నంబర్‌-1 డిపోకు చెందిన నిర్వాహకుడు సైతం పోలీసుల రాకకు ముందే దుకాణానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దీంతో అధికారులు వచ్చే సమయానికి కొన్ని దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

కామారెడ్డి పట్టణంలో నార్కోటిక్స్‌ పోలీసుల దాడుల విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు చేరడంతో దేవునిపల్లి, రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు తదితర ప్రాంతాల్లోని కల్లు దుకాణాలు కూడా మూతపడ్డాయి.

దుకాణాలు మూసివేసి నిర్వాహకులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. వరుస తనిఖీలతో కల్లు డిపో నిర్వాహకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments