HomeCRIMEప్రగతి ఆసుపత్రిలో వ్యక్తి మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు కుటుంబ సభ్యుల ఆరోపణలు

ప్రగతి ఆసుపత్రిలో వ్యక్తి మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు కుటుంబ సభ్యుల ఆరోపణలు

ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరిన బోధన్‌కు చెందిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబాయ్‌ మృతిచెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..బోధన్‌కు చెందిన సత్యనారాయణకు ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న అభినయ ఆసుపత్రికి తరలించారు.

ప్రథమ చికిత్స అనంతరం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచించడంతో నిజామాబాద్‌లోని ప్రగతి ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాత్రి సుమారు 2.30 గంటలకు ఆసుపత్రిలో చేర్పించగా ఈసీజీ తీసి ఐసీయూలో చికిత్స ప్రారంభించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆదివారం ఆరోగ్యశ్రీ వర్తించదని, సోమవారం చేయించుకోవాలని చెప్పడంతో ఆసుపత్రిలోనే ఉంచారని పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో కార్డియాలజిస్ట్‌ అందుబాటులో లేరని, సోమవారం వస్తారని సిబ్బంది చెప్పినట్లు తెలిపారు. సోమవారం వైద్యులు వచ్చి రక్త పరీక్షలు చేయించారని, వాటి ఆధారంగా ఇంజెక్షన్లు ఇస్తూ చికిత్స కొనసాగించారని చెప్పారు.

రక్త పరీక్షల్లో గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్య ఏమీ లేదని, కొంత తేమ ఉన్నట్లు గుర్తించామని వైద్యులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం సత్యనారాయణకు మోషన్‌ వస్తున్నట్లు అనిపించడంతో వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందినట్లు తెలిపారు.

ఆసుపత్రి సిబ్బంది ఆయనను నడిపించుకుంటూ వాష్‌రూమ్‌కు వెళ్లమని చెప్పడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఛాతినొప్పితో వచ్చిన వ్యక్తికి ఆదివారం నుంచి గుండెకు సంబంధించిన ప్రత్యేక వైద్యం సకాలంలో అందకపోవడం, కార్డియాలజిస్ట్‌ అందుబాటులో లేకపోవడం వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే సత్యనారాయణ మృతికి అసలు కారణం ఏమిటన్నది వైద్యపరమైన నిర్ధారణ కావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఆసుపత్రి వైద్యుల వివరణ తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments