HomeCRIMEవామ్మో ఇదేమి తెగింపు ...... షాక్ తిన్నా పోలీసులు .....పట్టపగలే ఇంట్లోకి చొరబడి.....వృద్ధు రాలు మెడలో...

వామ్మో ఇదేమి తెగింపు …… షాక్ తిన్నా పోలీసులు …..పట్టపగలే ఇంట్లోకి చొరబడి…..వృద్ధు రాలు మెడలో గొలుసు ఎత్తుకెళ్లారు…….

తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ ….జనసందడి లేని ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే వారిని దోచారంటే షరా మాములే అనుకోవచ్చు ! మారుమూల ప్రాంతాల్లో పట్టపగలు జరిగిన ఏమో అనుకోవచ్చు .

కానీ పట్టపగలు అందులోనూ నగరంలో రోజంతా అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటిగా ఉండే వీక్లి మార్కెట్ లో పైగా ఇరుగు పొరుగు చూస్తుండగానే అచ్చం సినిమా పక్కి లో ఓకే ఒక్కడు ఒకరిద్దరు చూస్తుండగానే దర్జాగా వృద్ధు రాలు ఒక్కరే ఉండే ఇంట్లో కి చొరబడి.

ఆమె మీద విరుచక పడ్డాడు కానీ ఆ వృద్ధు రాలేమి బెంబేలెత్తి పోలేదు తిరగబడింది విరోచితంగా కొట్లాడింది. కానీ నేరాలు చేయడంలో ఆరి తేరిన దొంగ వృద్ధు రాలు జుట్టును గట్టిగా పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి ఈడ్చుకుంటూ బయటకి తెచ్చాడు. ఆరు బయట ఆమె ను ఎత్తి పడేసి మెడలో ఉన్న మూడున్నర తులాల గొలుసు ఎత్తుకెళ్లాడు.

అయితే ఇదేమి నిమిషం…. అర .నిమిషం లో రెప్ప పాటు కాలం జరిగిందేమి కాదు. అందులోనూ ఎవ్వరూ లేని సమయంలో జరిగిన ఘటనేమి కాదు.

చోరీ కోసం వృద్ధు రాలి ఇంట్లో చొరబడినప్పటి నుంచి అఘాంతకుడు వెళ్లదాకా ఇంటి పక్కన ఓ మహిళా కొద్దీ దూరం లో ఇద్దరు యువకులు చూస్తుండగానే జరిగింది.

ఒంటరిగా ఉన్న వృద్ధు రాలు ఇంట్లోకి గుర్తు తెలియని యువకుడు వెళ్తుండగా గమనించిన ఓ మహిళా ఆరు బయటే చేస్తూ కాలయాపన చేస్తున్నది. సదురు యువకుడు విజయ అనే వృద్ధు రాలి ని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటికి తెస్తుంటే కనీసం అడ్డు వెళ్ళడానికి సైతం సదురు మహిళా వెనుకాడింది

సరే కనీసం అరిచి గగ్గోలు పెట్టినా మరికొంత మంది పోగయ్యేది మెడలో నుంచి గొలుసు ఎత్తుకొని యువకుడు వెళ్తుంటే ఎదురుగానే ఇద్దరు యువకులు చూస్తూ ఉండి పోయారు కనీసం పారిపోతున్న ఒక్కడి ఇద్దరు కలిసి పట్టుకునే ఛాన్స్ ఉండే !

వృద్ధు రాలు విజయ మెడలో గురువారం గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన కు సంబంధించి దర్యాప్తు మొదలు పెట్టిన ఒకటో టౌన్ పోలీసులకు విస్తు గొలిపే సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది. సదరు దొంగ గొలుసు ఎత్తుకెళ్లడానికి ఎలా తెగించాడనేది చూసి పోలీసులే నివ్వెర పోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments