HomeTelanganaHyderabadసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూల్చేవేత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను కూల్చేవేత

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌‌ భవనం ముందు భాగం ను శుక్రవారం భారీ యంత్రాల తో నేలమట్టం చేశారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా స్టేషన్‌లో కూల్చివేతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ హార్చ్ గోడలను నేలమట్టం చేశారు.

1874 లో నిజాం,హయాంలో నే బ్రిటీష్ పాలకుల ఆదేశాలు మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. నిజాం ఆధీనంలో ఉండే ఈ స్టేషన్.. 1950 తర్వాత భారత రైల్వే పరిధిలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం స్టేషన్ ను ఆధునీకరించింది మరోసారి స్టేషన్ ను ఆధునిక హంగులతో నిర్మించడానికి భారతీయ రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది .

ఈ ఏడాది డిసెంబర్ కల్లా రైల్వే స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో నిర్మించాలని టార్గెట్ , రూ.653 కోట్ల అంచనాతో టెండర్లకు పిలిచింది., దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ కి తగ్గట్టుగానే సువిశాలంగా నిర్మిస్తున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments