ఆర్మూరు జంబి హనుమాన్ దేవాలయంలో జరుగుతున్న అవినీతి అవకతవకలు పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి పన్నంవార్ తెలిపారు.
ఆయన శుక్రవారం హైదరాబాదులోని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ కుlఅడిషల్ కమిషనర్ లతో పాటు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
అక్కడ పనిచేస్తున్న సిబ్బందే అవినీతి అక్రమాలకు పాలుపడుతున్నాడని అంతేకాకుండా దేవాలయనికి వచ్చే చందాలలో చేతివాటం చూపిస్తున్నారని చాలా ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్ విధులకు రాక పోవడం వల్లే ఇతర సిబ్బంది ఇష్ట రాజ్యంగా చేస్తున్నారని ఈవోగా అర్చకుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూరని రెగ్యులర్ ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
వారిని కాపాడటంలో మతలబు ఏమిటో ఈఓ గారే చెప్పాలన్నారు ఏటా రూ 17 లక్షల ఆదాయం వస్తున్న దేవాలయానికి కనీస వసతులు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా శాశ్వతమైన అర్చకులను ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారని దొంగతనాలు జరిగిన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనుక ఆంతర్యం బయట పెట్టాలని అయన డిమాండ్ చేశారు
అవినీతికి పాల్పడుతున్న వారి మీద బహిరంగ విచారణ చేసి శాఖపరమైన చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగించవలసిందిగా ఆయన కోరారు
