బాన్సువాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంసాగర్ వద్ద 91 కిలోల గంజాయిని పట్టుకున్నందుకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ టీముకు క్యాష్ రివార్డుతోపాటు ప్రశంసాపత్రాలు డైరెక్టర్ కమలహాన్ రెడ్డి అందజేశారు.
శుక్రవారం హైదరాబాద్ లోని డైరెక్ట రేట్ కార్యాలయంలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్నతోపాటు టీముకు రూ.30వేల క్యాష్ రివార్డును అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ, నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి, ఎన్ ఫోర్స్ మెంట్ టీము పాల్గొన్నారు.
