HomeCRIMEఆ నగదు ఉన్న వాహనం ఎత్తుకెళ్లిన రికవరీ ముఠా ….నగదు లేదంటూ బుకాయింపు ……పోలీసులు ఆశ్రయించిన...

ఆ నగదు ఉన్న వాహనం ఎత్తుకెళ్లిన రికవరీ ముఠా ….నగదు లేదంటూ బుకాయింపు ……పోలీసులు ఆశ్రయించిన బాధితుడు

నగదు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నురెప్పపాటు కాలం ఎత్తుకెళ్లిన ఉదంతంలో షాకింగ్ విషయాలు తెలిసాయి. నగదు ఉన్న ఆ వాహనం ను రికవరీ ముఠా ఎత్తుకెళ్లినట్లుగా తేలింది.

కానీ ఆ వాహనంలో ఎలాంటి నగదు లేదంటూ బుకాయిస్తుంది. గణేష్ విగ్రహాలు అమ్మిగా వచ్చిన నగదు మొత్తం అందులనే వుందని బాధితుడు లబోదిబో మంటూ పోలీసులకు పిర్యాదు చేసాడు.

రికవరీ ముఠాలు నగరంలో గత కొద్దీ రోజులుగా ఒకటి రెండు వాయిదా లు చెల్లించని వాహనాలను క్షణాల్లో మాయం చేస్తున్నారు.

శివాజీ నగర్ కు చెందిన బబ్లు సైతం రెండు వాయిదా చెల్లించక పోవడంతో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కు చెందిన రికవరీ ముఠా వాహన దారుడిని వెంబడించింది.

ఆతను బండి పార్క్ చేసి వెళ్లడమే ఆలస్యం ఆ వాహనం లాక్ ఉన్నా సరే ఎత్తుకెళ్లింది. నిజామాబాద్ నగరంలోని పెద్దబజార్ లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. శివాజీ నగర్ కు చెందిన కిషోర్ అలియాస్ బబ్లు గణేష్ విగ్రహాలు అమ్ముకొని జీవనం సాగిస్తాడు.

ఈసారి విగ్రహాలు అమ్మడం తో వచ్చిన నగదు ను శుక్రవారం బ్యాంకు లో జమ చేయడానికి వచ్చాడు ఆ నగదు ను తన యాక్టివా వాహనంలో పెట్టి ఓ షాప్ వద్ద నిలిపాడు.

ఇద్దరు యువకులు బైకు మీద వచ్చారు అందులో ఒకడు బండి నెట్టుకుంటూ కొంత దూరం తీసుకెళ్లి అక్కడి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.మొదట చోరీ అయినట్లుగా భావించి నప్పటి రికవరీ ముఠాలనుంచి ఫోన్ రావడంతో షాక్ అయ్యాడు.

బండి సీజ్ చేసినా సరే అందులో నగదు ఇవ్వాలని అడిగితే ఎహే అందులో చిల్లి గవ్వలేదంటూ బుకాయించారు. దీనితో బాధితుడు రెండో టౌన్ పోలీసులను ఆశ్రయించాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments