నందిపేట మండల కేంద్ర కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో బుధవారం ఓటు హక్కు మన అందరి హక్కు అంటూ… ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు.
కేటీఎస్ నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు చాకలి ఐలమ్మ, అంబేద్కర్, నంది విగ్రహాల గుండా బడి మస్జిద్, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వరకు సాగింది. ఓట్ ఫర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఓట్ ఫర్ బెటర్ ఇండియా, మై ఓట్ మై స్ట్రెంత్ అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని విద్యార్థులు నినాదాలు చేస్తూ..
ప్రధాన కూడళ్ల వద్ద నాటికలు వేస్తూ నృత్యాలు ఆడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించే చక్కని కార్యక్రమాన్ని చేపట్టారు.. “మన ఓటు విలువ ఇంతేనా” అనే నాటికను విద్యార్థులు ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రాజేశ్వర్ మాట్లాడుతూ….
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనకు ఇచ్చిన గొప్ప అవకాశం ఓటు హక్కు అని, ఈ ఓటు హక్కుతోనే దేశ భవిష్యత్తు ముడిపడి ఉందని, విలువైన ఓటు హక్కును ప్రలోభాలకు లొంగి అమ్ముకోవద్దని, సరైన నాయకున్ని ఎన్నుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని కొనియాడారు.
విద్యా, వైద్యం, పౌరుల రక్షణ విధానాల వల్ల దేశం అభివృద్ధి చెందుతుందని, అటువంటివారిని ఎన్నుకోవడం వల్ల దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని, అందుకే యువత ముందుకు రావాలని, విద్యాలయాలు, కళాశాలలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఓటు హక్కు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
డైరెక్టర్ బండి రామా గౌడ్, కరస్పాండెంట్ మాధురి రామా గౌడ్, ఉపాధ్యాయులు గంగా ప్రసాద్, కిరణ్, వినోద్, ధర్మపురి, శరత్, దివ్య, సరిత, ప్రేమల, షాహిన్, అసిఫ్, డాన్స్ మాస్టర్ సునీత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
