దేశంలోనే ఆదివాసుల అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర షెడ్యూల్ ఖరారు అయింది. వచ్చే ఏడాది ( 2026 ) జనవరి 28 న నాలుగు రోజుల పాటు ఈ జాతర మేడారం లో నిర్వహించనున్నారు.
ఈ మేరకు పూజారుల సంఘం ప్రతినిది సిద్దబోయిన జగ్గారావు ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 28, 29, 30, 31 . తేదీల్లో ఈ జాతర జరగనుంది.
మొదటి రోజు బుధవారం సారలమ్మ తో పాటు గోవిందా రాజు పడిగిద్ద రాజులు గద్దెల మీద కి వస్తారు రెండో రోజు గురువారం సమ్మక్క అమ్మవారు అడవి నుంచి గద్దె మీదికి వస్తారని మూడో రోజు చెల్లింపుల సమర్పణ నాలుగో రోజు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం తో జాతర ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.
