విద్యుత్ ఘాతంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..ఫర్వేజ్ ఖాన్(32) సిమెంట్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఈ మేరకు మంగళవారం రాత్రి బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ కు ఓ సిమెంట్ లోడ్ తీసుకొచ్చాడు.సిమెంట్ అన్ లోడ్ తర్వత లారీ రివర్స్ తీసుకునే వెనక ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అరీఫ్ తెలిపారు.
