పోలీసు స్టేషన్ లను తమ అడ్డాలుగా మార్చుకొని దందాలు సాగించే వారికోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరా తీస్తున్నారు. గత రెండు రోజులుగా వారు ఇదే కార్యాచరణలో నిమగ్నం అయి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన నేర సమీక్ష సమావేశంలో సీపీ ఈ విషయం ప్రస్తావన కు తెచ్చిన ఆయన మధ్యవర్తులు స్టేషన్ కు అదే పనిగా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి వారిని ఎందుకు ఇప్పటిదాకా గుర్తించలేక పోయారని ఆయన స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఆక్షేపించారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆయాస్టేషన్ ల్లాలో అడ్డా వేసి అనేక కేసుల్లో జోక్యం చేసుకొని వసూళ్ల దందా సాగిస్తున్నారనే కోణంలో ఎస్బి అధికారులు అరా తీస్తున్నారు. సీపీ ఈపాటికే కొందరి పేర్ల ను సైతం ప్రస్తావించారని సమాచారం.ఒకటో టౌన్ లో బిఆర్ యస్ నేత రెండో టౌన్ లో యం ఐ యం కార్పొరేటర్ మూడో టౌన్ చికెన్ సెంట నిర్వాహకుడు ఆరో టౌన్ లో ఓ హోం గార్డు అయిదో టౌన్ లో మొరం వ్యాపారి తో పాటు నాగారం కు చెందిన ఓ కాంగ్రెస్ చోటా నేత నగరంలో అన్ని స్టేషన్ లలో పైరవీరులు ఎలా చేస్తున్నాడని సీపీ ఆగ్రహం వ్యక్తం చేసి నట్లుగా సమాచారం. సీపీ రివ్యూ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు గత రెండు రోజుల్లో ఇదే టాస్క్ లో నిమగ్నం అయ్యారు. ఆయా స్టేషన్ ల్లో వచ్చి వెళ్లే వారిని అరా తీస్తున్నారు. ఏ పని మీద వచ్చింది ఎవరి సిఫారస్ తో వచ్చింది వాకబు చేస్తున్నారు. దీనితో పాటు సీపీ ప్రస్తావించిన వారు సైతం ఏ ఏ పనుల కోసం స్టేషన్ లకు వస్తుంది. విచారిస్తున్నారు. వారికి ఆయా స్టేషన్లలో ఎవరెవరితో లింకు లున్నాయి. ఎలాంటి కేసుల్లో జోక్యం చేసుకుంటున్నారనేది పక్కాగా తెలుసుకుంటున్నారు.ఇలాంటి వారితో అధికారులు ఎందుకు అంటకాగుతున్నారనేది కూడా కూపీ లాగుతున్నారు. ఎస్బి ఈ వ్యవహారం తెలిసి పోవడంతో ఆయా స్టేషన్ ల్లో అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు. వారు స్టేషన్ కు రాకుండా ముందే కట్టడి చేస్తున్నారు
ఠాణాల్లో అడ్డా వేస్తుంది ఎవరు ? అరా తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ …పైరవీలు చేస్తున్న వారిని గుర్తించే పనిలో ?
RELATED ARTICLES