Monday, December 8, 2025
HomePOLITICAL NEWSArmoorరైతు ల ఆందోళనకు అండగా వుంటా ......బిఆర్ యస్ విలీనం ఉత్తదే .......రుణమాఫీ తో వంచించారు...

రైతు ల ఆందోళనకు అండగా వుంటా ……బిఆర్ యస్ విలీనం ఉత్తదే …….రుణమాఫీ తో వంచించారు ఎంపీ అర్వింద్

రైతు ఐక్యకార్యాచరణ సమితి తలపెట్టిన ఆందోళనకు తాను అండగా వుంటానని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

బిఆర్ యస్ ను బీజేపీ లో విలీనం చేస్తున్నారంటూ దుష్పచారం చేస్తున్నారని అడ్డగోలు అవినీతి అక్రమాలకు పాల్పడిన కెసిఆర్ కవిత కేటీఆర్ లను బీజేపీ దగ్గరికే రానివ్వదన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలుకానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు జిల్లాలో 2.5 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 83,000 మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ వచ్చింది.

2 లక్షల పైనున్న వారికి కూడా భేషరతుగా రుణమాఫి చేయాలన్నారు అది సరైన పద్ధతి కాదు ఎంత రుణం ఉన్నా సరే మాఫీ రెండు లక్షలు బ్యాంకు ఖాతాలలో జమ చేయాలన్నారు ఇంతకు ముందు డిసెంబర్9 వ తారీఖున రైతులకు రుణమాఫీ చేస్తాం అని అన్నారు సీఎం రెవంతరెడ్డి మళ్ళీ రుణాలు తీసుకోండి నేను వచ్చాక రుణమాఫీ చేస్తానని

ఇప్పుడు మాట మార్చితే ఎలా అన్నారు రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని విమర్శించారు ప్రజలు రైతులకు ప్రజల్లో ప్రభుత్వం పై అసంతృప్తి ద్వేషం పెరుగుతుంది కేసీఆర్ మోసం చేశాడని తరిమేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొదటి వాగ్దానానికి అడ్డం పడుతుంది వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ ఒక్కసారి చేశారని ఆయన గుర్తు చేశారు కేసీఆర్ రాష్ట్రంలో చిప్ప చేతిలో పెట్టి వెళ్లాడన్నారు

రైతు రుణమాఫీ కోసం ఆర్మూర్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ శనివారం చేపత్తనున్న ధర్నాకు బిజెపి తరఫున ఎంపీగా తాను పూర్తి మద్దతు సంఘీభావం తెలుపుతున్నానని అలాగే వారికి ఎలాంటి సహకారం కావాలన్నా మా తరఫున ఉంటుందని పేరుకొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!