కమ్మర్‌పల్లి అటవీ ప్రాంతంలో గురువారం చిరుతపులి మృతి చెందిన వార్త సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు.
చివరికి అది పులికాదని అడవి పిల్లి మృతి చెందినట్లు నిర్దారించారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దని సమీప ప్రాంతంలో చిరుతపులి ఆనవాళ్లు కూడా లేవని తెలిపారు.
దీంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.