బిఆర్ యస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కు రంగం సిద్ధం అయింది. ఆమె ఏర్పాటు చెయ్యబోయే రాజకీయ పార్టీ కోసం పనిచేయడానికి రాజకీయ సిద్ధాంత కర్త ప్రశాంత్ కిషోర్ సైతం సానుకూలంగా ఉన్నారని సమాచారం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే పనిలో నిమగ్నం అయిన తెలంగాణ జాగృతి బృందాలు క్షేత్ర స్థాయిలో కి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరించింది ఈ మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని వివిధ కమిటీల సభ్యులు నివేదించడంతో పార్టీ ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో గతంలో తెరాస కు పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కవిత పక్షాన ఎంట్రీ ఇస్తున్నారు గత రెండు నెలల వ్యవధిలో అయన కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు వచ్చి రెండు సార్లు కలిశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సుదీర్ఘ భేటీ లు నిర్వహించారు.
. ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పని చేయాలనే అంశంపై పీకే తో కవిత సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే రోజుల్లో ఏ ఏ అంశాలు ప్రజాక్షేత్రంలో ప్రస్తావించాలని ఆమె అరా తీశారు. వీరి భేటీ నేపథ్యంలోనే కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు మరింత స్పీడ్ పెంచారని సన్నిహితులు చెప్తున్నారు.
ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసారు.తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన 50 కమిటీల సభ్యులతో సమావేశం ఆమె విరివిరిగా సమావేశం అవుతున్నారు
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తమ అధ్యయనం గురించి వివరించి ప్రాథమిక నివేదిక సమర్పించారు తెలంగాణ సమగ్రాభివృద్ధికి అవసరమైన బ్లూ ప్రింట్ రూపొందించే పనిలో నిమగ్నం అయి విస్తృత నివేదిక సిద్ధం చెయ్యాలని ఆయా కమిటీలను ఆమె పురమాయించారు.
