HomeTelanganaHyderabadజూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమమే గెలిపిస్తుంది..పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమమే గెలిపిస్తుంది..పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం..

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించబోతుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

గురువారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 35 శాతం పేద,మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోని వచ్చిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు.

ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాల సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఇక నిజామాబాద్ నగరంలోని మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిధులు మంజూరు లో కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేవి ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో మేము స్పష్టం గా ఉన్నామని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తామని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ల కు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారనీ తెలిపారు. గురువారం జిల్లాలోని 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు.

జిల్లాలను అభివృద్ధిలో ముందుకు తీసుకెళుతున్నామని తెలిపారు.కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు.గత బీ ఆర్ ఎస్ ప్రభుత్యం లో ఒక్క చిన్న పరిశ్రమ తెచ్చిన పాపాన పోలేదని పేర్కొన్నారు.

అలాగే పీసీసీ నియామకం అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన అప్పుడు జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఈ మేరకు గత నెలలో జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల అలాగే వ్యవసాయ కళాశాల తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో పామాయిల్ ఇండస్ట్రీ కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందని అలాగే మరో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలకు కూడా మంజూరై డిచ్పల్లి పరిధిలో స్థలం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం పై కావాలనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లలో పాత జామేదర్ వ్యవస్థను ప్రజలపై రుద్దారని పేర్కొన్నారు.కుటుంబ తగాదాల మాట్లాడని కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై పస లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.దండుపాలెం కుటుంబం యొక్క దోపిడీని కవితనే బయట పెట్టారని పేర్కొన్నారు.

కవిత చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేరని తెలిపారు.దండుపాలెం ముఠాలో కవిత కూడా సబ్యులు కదా అని ప్రశ్నించారు.దోపిడి పర్సంటేజ్ కోసం ఇప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో మైనార్టీ కి కూడా మంత్రి పదవిలో స్థానం దక్కుతుందని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అందుకే ఎన్నికలు కూడా వాయిదా వేశామని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుల గణన చేసి దాని ఆధారంగానే బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ,గడుగు గంగాధర్, కేశ వేణు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments