HomeTelanganaNizamabadసిండికేట్ అయిన లిక్కర్ కింగ్ లు………కీలక షాప్ లు దక్కించుకోవడానికి ఏకం అయిన లిక్కర్ వ్యాపారులు...

సిండికేట్ అయిన లిక్కర్ కింగ్ లు………కీలక షాప్ లు దక్కించుకోవడానికి ఏకం అయిన లిక్కర్ వ్యాపారులు …….సిండికేట్ లో 14 మంది? నాలుగు గ్రూప్ లు …… 27 న లక్కీ డీప్ …..గతంలో కంటే తగ్గిన దరఖాస్తులు..

మద్యం దుకాణాలు వచ్చాక సిండికేట్ అయ్యే వ్యాపారులు ఈసారి దరఖాస్తులు చెయ్యడానికే సిండికేట్ అయ్యారు. దశాబ్దాల తరబడిగా మద్యం వ్యాపారం ను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న ఎనిమిది మంది ఈసారి టెండర్ ల పక్రియ లోనే చక్రం తిప్పారు. అడ్డగోలుగా దరఖాస్తులు వెయ్యకుండా ముందుగానే కట్టడి చేశారు. ఇక్కడే సిండికేట్ అయ్యారు ఒక్కో సిండికేట్ లో 14 నుంచి 20 మంది ఉన్నారు ఇలాంటి సిండికేట్ లు నాలుగు ఏర్పాటు అయ్యాయి. గతంలో సింగిల్ వేసిన దరఖాస్తులు చేసిన వారిని ఈసారి సిండికే ట్ లో వచ్చేలా చక్రం తిప్పారు. జిల్లాలో మద్యం దుకాణాల కోసం 2790 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికిరూ 83 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. సుమారు రూ 90 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని ఆబ్కారీ అధికారులు అంచనా వేశారు. కానీ ఆశించిన మేరకు దారకస్తులు రాలేదు.ఈ నెల 27 న మద్యం దుకాణాలను కేటాయిస్తారు. లక్కీడిప్ ద్వార ఈ పక్రియ కలెక్టర్ సమక్షంలో నిర్వహిస్తారు. ఈసారి భారీ సంఖ్యలో దరకాస్తు లు వస్తాయని భావించినా దరఖాస్తు పీజు ఏకంగా లక్ష పెరగడంతో చాల మంది ఔత్సాహికులు వెనక్కి తగ్గారు.

ఈసారి జిల్లాలో అనుకున్న ‘కిక్కు’ లభించలేదు. వచ్చే దరఖాస్తులతో దండిగా సర్కారు ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చాలనుకున్న అధికారుల ప్రయత్నానికి సిండికేట్ దెబ్బతీసింది. దీనికి తోడు గతానికి భిన్నంగా ఈసారి దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుము నిర్ణయించడంతో ఆశించిన విధంగా పోటీదారులు ముందుకు రాలేకపోయారు. గత నెల 26న నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఈ నెల 23 గురువారం నాటికి ఊహించినదానికంటే తక్కువ అర్జీలొచ్చాయి. ఈ మేరకు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుటుంబ సభ్యులు, మహిళల పేర్లతోనూ దరఖాస్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, గౌడలకు రిజర్వు చేసిన దుకాణాలకు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. నూతన మద్యం పాలసీతో 2025 లో జిల్లాలో 102 దుకాణాలకు దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. గత పాలసీతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 1000 దరఖాస్తులు తక్కువ గా వచాయి.కానీ రావడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. నిజామాబాద్ జిల్లా లోని దుకాణానికి 36, ఆర్మూర్ దుకాణానికి 25 దరఖాస్తులు,బోధన్ 18, భీమ్ గల్ 12,మోర్తాడ్ పరిధిలో 11 వైన్స్ దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. సగటున ఒక్కో షాపునకు 150 నుంచి 250 వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ నెల 27 న జిల్లాలోని హైదారాబాద్ లోని భారతి గార్డెన్ లో లాటరీ ఉంటుంది. డిసెంబర్‌ 1న నూతన అబ్కారీ విధానం అమల్లోకి వస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments