నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవీపేట్ – బాసర రహదారి సమీపంలో వీర హనుమాన్ గుడి కెనాల్ పక్కన ఫతేనగర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణంగా హత్యకు గురైంది.
స్థానికుల సమాచారం మేరకు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు కాలిన మహిళ మృతదేహం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి నవీపేట్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. గురువారం రాత్రి ఘటన జరగవచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
