HomeDevotionalమొదలైన ఏడుపాయల జాతర .......అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించన మంత్రి దామోదర.......మూడు రోజుల పాటు...

మొదలైన ఏడుపాయల జాతర …….అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించన మంత్రి దామోదర…….మూడు రోజుల పాటు జరగనున్న జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల లో మహాజాతర మొదలైంది. ప్రతియేటా మహాశివరాత్రి నాడు జరిగే ఈ జాతర మూడు రోజులపాటు అత్యంతభక్తి శ్రద్ధలతో జరుపుతారు మహాశివరాత్రి సందర్భంగా వనదుర్గభవని మాతకు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పట్టు వస్త్రాలు సమర్పించారు..

ఈ సందర్భంగా మంత్రిని పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఈవో చంద్ర శేఖర్ ఘన స్వాగతం పలికారు. మంజీరా నది పాయలలో ఏర్పాటుచేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ వద్ద మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించి మూడు రోజులు జరిగే జాతర ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో గల శ్రీ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. భక్తులు మెచ్చే కోరిన కోరికలు తీర్చే దేవతగా పిలవబడే వనదుర్గ అమ్మవారి జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పిల్లాపాపలతో జాతరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతాయని అని అన్నారు.

వనదుర్గ అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారని, వీరంతా వనదుర్గ గుడి ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేసేందుకు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాలతో అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కల్గించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

ఈ క్రమంలో ఏడుపాయల్లో భక్తుల రద్దీ నెలకొందని జాతర సందర్భంగా వనదుర్గా భవాని మాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగు రంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించాలన్నారు.ఏడుపాయల మహా జాతర ప్రధానంగా మూడు రోజులు జరుగుతుందని రెండో రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల బోనాల ఊరేగింపు, మూడో రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయన్నారు.

ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్ క్యాంప్లు, గజ ఈతగళ్లు ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాంమని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి చంద్రశేఖర్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments