ఎలాగో శివరాత్రి ఎలాగైనా తెల్లవారు జామున నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతారు కదా అదే అదనుగా భావించింది ఓ దొంగల ముఠా పక్కగా ప్రణాళిక వేసుకుంది అందుకు అనువుగా శివారు ప్రాంతాల్లో సింగిల్ ఇండ్లమీదే డేగ కన్ను వేసింది.
బుధవారం శివరాత్రి పండగ నేపథ్యంలో దర్శనం కోసం భక్తులు ఉదయం9 గంటాలకే నగరంలో ఆయా శివాలయాలకు పోటెత్తారు. దైవ దర్శనమే కదా ఇలా వెళ్లి గంట రెండు గంటల్లోగా వచ్చేస్తామని భరోసా తాళం వేసి వెళ్లారు. కానీ దర్శనం చేసుకొని తిరిగి వచ్చి చుస్తే ఇల్లు లూటీ అయ్యాయి. జస్ట్ రెండు గంటల వ్యవధిలో నగర శివారు లో మూడు ఇండ్లనుదోచేశారు.
ఏక శీలా నగర్ లో పెద్దమ్మ గుడి సమీపం లో ఉండే కిరాణా వ్యాపారి రవీందర్ ఇంటికి ఉదయం 10:30 తాళం వేసిగుడి కి వెళ్లి కొద్దీ నిమిషాల్లో వచ్చి చుస్తే తాళం పగల గొట్టి రూ 60 వేల నగదు ఎత్తుకెళ్లారు ఇంట్లో నగలున్న అవి చోరీ కాలేదు.
అలాగే గంగాస్టాన్ లో రియల్టర్ బలరాం రెడ్డి ఈ మద్యే కేశాపుర్ వెళ్లే దారి లో ఇళ్లు కట్టుకున్నాడు మధ్యాహ్నమే 12:30 కి తాళం వేసి కాంటేశ్వర్ గుడికి వచ్చి దర్శనం చేసుకొని 1:15 కు వెళ్లే సరికి తాళం పగల గొట్టి ఉంది ఇంట్లో వెళ్లి చుస్తే బీరువా లో చిన్న కూతురు కు చెందిన సుమారు 25 తులాల నగలు మాయం అయ్యాయి.
అలాగే ఆర్టీసీ కాలొనీ లో రవీందర్ సైతం గుడికి వెళ్లి వచ్చే లోపు ఇంటి తాళంపగల గొట్టేసి రెండు తులాల నగలు ఎత్తుకెళ్లారు. మూడు చోరీ లు ఓకే తరహాలో జస్ట్ రెండు గంటల లోపే జరిగాయి. అదికూడా పట్టపగలే చోరీ లకు పాల్పడింది ఒక్కడేనా లేదా మరేదైనా ముఠా ఉందా అనేది అరా తీస్తున్నారు
