తాగిన మైకం లో ఉండి తనను అడ్దుకున్నారనే ఆగ్రహించిన ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ లను తన ఇంటి వద్ద చెట్టుకు కట్టేసి కొట్టి ఆపై పోలీసులకు అప్పగించిన వైనం ఇది …!
కోటగల్లి ఎడ్ల హనుమాన్ మందిర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ సోమవారం సైకిల్ మీద తన ఇంటికి వస్తున్నాడు అదే ప్రాంతానికి చెందిన … వంశీ తన స్నేహితులు మరో ఇద్దరి తో కలిసి చౌరస్తా లో కాలక్షేపం చేస్తున్నాడు.
అయితే వారిని గమనిస్తున్న వెళ్తున్న ప్రశాంత్ ను అటకాయించి ఎందుకు చూస్తున్నావంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ మీద చేయి చేసుకున్నారు.
ఇదో అవమానంగా భావించిన ప్రశాంత్ మంగళవారం ఉదయమే తన స్నేహితులను వెంటేసుకొని రాత్రి హనుమాన్ మందిరం వద్ద వంశీ కోసం వాకబు చేసి దొరక్క పోవడంతో అతని వెంటే ఉన్న ఇద్దరు మైనర్ యువకులను పట్టుకొని తన ఇంటి సమీపంలోనే గ్రామ దేవతలను తయారీ చేసే ప్రాంతంలో ఓ వేప చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఆతర్వాత ఆ ఇద్దరిని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్ప గించారు గత రాత్రి తనను అటకాయించి అకారణంగా చేయి చేసుకున్నారంటూ ప్రశాంత్ పోలీసులకు పిర్యాదు చేసారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
కానీ ఇద్దరు మైనర్ లను చెట్టుకు కట్టేసి కొట్టడం పైన పోలీసులు సైతం ఆక్షేపించారు.
