HomePOLITICAL NEWSNationalఇందూరు ప్రజల చిరకాల స్వప్నం..పసుపు బోర్డు . రైతుల పండుగ నాడే పసుపు బోర్డు ఏర్పాటు..పసుపు...

ఇందూరు ప్రజల చిరకాల స్వప్నం..పసుపు బోర్డు . రైతుల పండుగ నాడే పసుపు బోర్డు ఏర్పాటు..పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డి..పసుపు బోర్డు ను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్..

ఇందూరు ప్రజల చిరకాల స్వప్నం జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా పసుపు బోర్డు ప్రారంభించారు.

ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ…పీఎం నరేంద్ర మోడీ ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చరనికి, మోదీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు నిజామాబాద్ ఏర్పాటైందనీ హర్షం వ్యక్తం చేశారు.

నిజామాబాద్ పండే పసుపునకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు ఇతర అనేక ఉత్పత్తులు గతంలో ఎక్కువగా ఎగుమతి అయ్యేవికావని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ కృషితో ఆ పరిస్థితి మారింది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రారంభం కావడం.రైతు పండగ నాడు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు కావడం ఎంతో సంతీసమని తెలిపారు.అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో శ్రమించారని తెలిపారు.

తెలంగాణతో సహా మొత్తం 20 రాష్ట్రాల్లో మొత్తం 30 రకాల పసుపును పండిస్తు్న్నాయని చెప్పారు. పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా రైతులు పోరాటం చేశారని గుర్తు చేశారు. నేడు ఆ రైతుల జీవితాల్లో ప్రధాని మోదీ వెలుగులు నింపారని అన్నారు. అలాగే పసుపు రైతులకు తొలి పసుపు బోర్డు చైర్మన్ గా నియమించిన పల్లె గంగారెడ్డి నీ అభినందించారు.”

పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరింది..ఎంపీ ధర్మపురి అరవింద్..పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందనీ పేర్కొన్నారు.

బోర్డు ఏర్పాటుతో అన్నదాతలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో బోర్డుతో ఎంతో ఉపయోగం ఉంటుందనీ అన్నారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు.

ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ మాత్రం అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించిందనీ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ఆ తర్వాత అక్టోబరు 4న కేంద్ర వాణిజ్యశాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ ఆ గెజిట్‌లో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిందనీ పేర్కొన్నారు.

దీనికి చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నీ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిందనీ పేర్కొన్నారు.పల్లె గంగారెడ్డి మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు.

ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి,భారత స్పైస్ బోర్డ్ కార్యదర్శి హేమలత, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి కేసంగ్ యంగ్ జోం షేర్పి, స్పైస్ బోర్డు డైరెక్టర్ రేమ శ్రీ, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ఫాల్ సూర్యనారాయణ గుప్తా, దినేష్ కులచారు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments