రైతును బురిడీ కొట్టించి ఓ కేటుగాడు డబ్బులు స్వాహా చేశాడు. ఈ ఘటన మోపాల్ మండలంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే మోపాల్ మండలానికి చెందిన గంగారెడ్డి అనే రైతు రెండు రోజుల కిందట నిజామాబాద్‌లోని ఓ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లి అక్కడ ఉన్న ఓ వ్యక్తి సహాయంతో రూ.5 వేలు డ్రా చేశాడు.
ఈ సమయంలో ఆ కేటుగాడు వేరే కార్డు ఇచ్చి రైతును మోసం చేసి అనంతరం రూ.30 వేలు డ్రా చేశాడు. మేసేజ్‌లు రావడంతో రైతు పోలీసులను ఆశ్రయించారు.
