రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
శనివారం భీంగల్ లోని శ్రీ లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఏర్పాట్లపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలనీ సుంచించరు.పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలనీ అన్నారు.
భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనీ తెలిపారు. పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ జాతర విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా భీంగల్ సీఐ సత్యనారాయణ , భీంగల్ ఎస్సై సందీప్, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
