నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ను స్థాయి పెంపు కోసం కమిషనర్ తాజా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు.
నగరంలో శాంతి భద్రతల నిర్వహణ కోసంఆరు పోలీస్ స్టేషన్ లుండగా రూరల్ స్టేషన్ పరిధి లోని నగరంలో నాలుగు డివిజన్ లున్నాయి. అయినప్పటికీ నగరంలో పెరుగుతున్న జనాభా తో పాటు నేరాలసంఖ్య కూడా పెరుగుతుంది.
ఈపాటికే ఒకటో టౌన్ స్టేషన్ ను సైతం స్థాయి పెంచారు. సీఐ నే స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నియమించారు మరో ఇద్దరు ఎస్సై లను సైతం అందుబాటు లో ఉన్నారు.
ఇలాగే నాలుగో టౌన్ స్టేషన్ స్థాయి ని కూడా పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసారు. సీఐ నే యస్ హెచ్ వో గా మరో ఇద్దరు ఎస్సై లుగా నియామకం చేయనున్నారు. ప్రస్తుతం నాలుగో టౌన్ కు ఇద్దరు ఎస్సై లున్నారు కానీ అదనంగా సీఐ తో పాటు ఏ ఎస్సై లు ఇతర సిబ్బంది కూడా పెరగనున్నారు.
నాలుగో టౌన్ ఏరియా లో నేరాల శాంతి భద్రతల నిర్వహణ మరింత మెరుగు పర్చడానికే కమిషనర్ ఆ ప్రతిపాదనలు సిద్ధం చేసారు.సీఐ గా ఓ సమర్థుడైన అధికారి పేరును ఆయన ఐజి కి ప్రతిపాదించారని సమాచారం
