సెల్లార్ కోసం తవ్వకాలు చేస్తుంటే గోడ కూలి ముగ్గురు కూలీలు మృత్యువాత పడినఘటన ఎల్బీనగర్ జంక్షన్ సమీపంలో చోటు చేసుకుంది.గ్రాండ్ సితారా హోటల్ పక్కనే సెల్లార్ కోసం తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఓ భారీ గోడ అక్కడ పని చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మట్టి దిబ్బలు మీద పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందులో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి . .
మృతులంతా బిహార్ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం హైదారాబాద్ వచ్చి రోజువారీ కూలీ పనులు చేస్తున్నారు .
