తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని (పీఎస్ఓ ) టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సన్మానించారు. విధి నిర్వహణలో భద్రతా సిబ్బంది చూపిన చొరవ ను ఆయన అభినందించారు శాలువా కప్పి సన్మానించారు ఇటీవల గాంధీ భవన్ లో సంబరాల్లో జరిగాయి.
ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి చేతికి పనిచెప్పాడు కార్యకర్తల ఫోన్ లు పార్స్ లను కొట్టేస్తున్నారు. అప్పటికే 8 సెల్ ఫోన్స్ కొట్టేసాడు.
విషయం పసిగట్టిన ఓ ఫోటోగ్రాఫర్. మహేష్ గౌడ్ వద్ద ఉన్న గన్ మెన్ చెవిన పడేసాడు. గన్ మెన్ దేవరాజ్ రంగంలోకి దిగి సదురు దొంగ ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు అతని నుంచి ఎనిమిది సెల్ ఫోన్ లు రికవరీ చేశారు.
