నగరంలో మూడేళ్ల బాలిక కిడ్నాప్ అయ్యింది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే.
నాగారం కెనాల్ కట్ట కు చెందిన కొండవ్వ తన మనవరాలైనా రమ్య ను తీసుకుని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో గాంధీ చౌక్ వద్ద నిద్రిస్తుంది.
ఈ క్రమంలో గంట సమయంలో నిద్ర లేచి చూసేసరికి బాలిక కనిపించకుండా పోయింది.దీంతో చుట్టూ పక్కల ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.
దీంతో ఒకట టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
