Monday, April 20, 2026
HomeTelanganaNizamabadవీరవనీత చాకలి ఐలమ్మను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి -అర్బన్ ఎమ్మెల్యే

వీరవనీత చాకలి ఐలమ్మను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి -అర్బన్ ఎమ్మెల్యే

ఇందూర్ నగరం :

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయకనగర్ విగ్రహాల పార్కులో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఇందూర్ *అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు* పాల్గొన్నారు ఈ సందర్బంగా ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ మఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత సాకాలి ఐలమ్మ అని అన్నారు

రాణి రుద్రమ్మ పౌరుషన్నిపాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకాలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికెల చేసిందని అన్నారు సాకాలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శం ఆడది అంటే అభల కాదు ఆది పరశక్తి అని రుజువు చేసిన దీర మహిళా సాకాలి ఐలమ్మ అని అన్నారు

ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బిజెపి పనిచేస్తుందని అన్నారు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలలో అనేక మంది ఆడబిడ్డల పైన అఘాత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని శాంతి భద్రత విషయంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆడబిడ్డలకు రక్షణ లేకుండ పోయిందని ద్వాజమెత్తరు నేటి మహిళలు సాకాలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని అన్నారు

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!