క్రికెట్ ఆడుతున్న ఇద్దరి మీద పిడుగుపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ లో జరిగింది పడాలపల్లి లో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా.. ఒక్కసారిగా వర్షం వచ్చింది.
దీంతో అంతా అక్కడే ఉన్న ఓ చెట్టు కిందకి వెళ్లారు. ఈ క్రమంలోనే అదే చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
