నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వివిధ పోలీస్ స్టేషన్లలో స్పెషల్ బ్రాంచ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ లు,హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లను పోలీస్ కమిషనర్ బదిలీలు చేశారు.
గతంలో ఒకటి,రెండవ టౌన్ ఎస్బి ఏఎస్ఐ గా విధులు నిర్వహించిన లింగారావు ను నాలుగవ టౌన్ కు బదిలీ చేశారు. అలాగే నాలుగు,ఐదు టౌన్ పరిధిలో విధులు నిర్వహించిన ముత్తెన్నను ఒకటవ టౌన్ కు బదిలీ చేశారు.
మూడు,ఆరవ టౌన్ పరిధిలో విధులు నిర్వహించిన గంగాధర్ గౌడ్ ను ఇప్పుడు ఆరవ టౌన్ పరిధికి మాత్రమే బదిలీ అయ్యారు. నిజామాబాద్ రూరల్, మోపాల్ పరిధిలో విధులు నిర్వహించిన పి సాయిలను నందిపేట్, ఆలూరు పరిధికి బదిలీ చేశారు. అలాగే డిచ్పల్లి పరిధిలో ఉన్న సురేందర్ రెడ్డి ని మోపాల్ డిచ్పల్లి ఇందల్వాయి కి బదిలీ అయ్యారు.
ధర్పల్లి సర్కిల్ పరిధిలో ఉన్న వసంత్ ను డిచ్ పల్లి,సిరికొండ కు బదిలీ చేశారు. భీంగల్ సర్కిల్ లో ఉన్న రమేష్ ను కమ్మర్పల్లి, ఏర్గట్ల,భీంగల్ కు బదిలీ చేశారు.మోర్తాడ్, ఏర్గట్ల లో ఉన్న మనోజ్ ను ముప్కల్, మెండోర,మోర్తాడ్ కు బదిలీ చేశారు.
అలాగే ఆర్మూర్ రూరల్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న రతన్ సింగ్,ను బాల్కొండ, జక్రన్ పల్లి, వేల్పూరు కు అలాగే ఆర్మూర్ టౌన్ పరిధిలో పనిచేస్తున్న అన్వర్ ను నిజామాబాద్ టౌన్ 2,టౌన్ 5 కు, అలాగే మాక్లూర్,నందిపేట్ పరిధిలో విధులు నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి ను నిజామాబాద్ రూరల్,టౌన్ 3 కు, అదేవిధంగా నవీపేట్, ఏడపల్లి,రెంజల్ పరిధిలో ఉన్న కాశీనాథ్ ను రుద్రూర్ సర్కిల్ పరిధికి అలాగే రుద్రూర్ సర్కిల్ లో ఉన్న శ్రీనివాస్ ను రెంజల్ ఏడపల్లి కి, అదేవిధంగా వేకెంట్ లిస్ట్ లో ఉన్న రాజేశ్వర్ ను నవీపేట్,మాక్లూర్ కు, గోపినీ ఆర్మూర్ రూరల్,టౌన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
