నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఎస్ఐల బదిలీలు చేస్తూ అదనపు డీసీపీ బాస్వారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీఆర్ లో అటాచ్ ఉన్న ఎస్ఐ సామ శ్రీనివాస్ ను ధర్పల్లీ ఏస్హెచ్ఓ గా బదిలీ చేశారు.
అలాగే అక్కడే ఉన్న కళ్యాణి ను వీఆర్ కు అటాచ్ చేశారు.వీఆర్ లో అటాచ్ గా ఉన్న వంశీ కృష్ణ ను వర్ని ఏస్హెచ్ఓ గా బదిలీ చేశారు.అక్కడే ఉన్న మహేష్ ను వీఆర్ కు అటాచ్ చేశారు.అదేవిధంగా నవీపేట్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ తిరుపతి నీ భీమ్ గల్ ఏస్హెచ్ఓ గా బదిలీ చేశారు.
భీమ్ గల్ లో ఎస్ఐ గా పని చేస్తున్న సందీప్ ను నాలుగవ టౌన్ ఎస్ఐ గా బదిలీ చేశారు. నాలుగవ టౌన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ను నవీపేట ఏస్హెచ్ఓ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
