HomeTelanganaHyderabadఆక్రమించిన చెరువు ను ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలి..... టిఆర్ యస్ అధినేత కవిత డిమాండ్ ......

ఆక్రమించిన చెరువు ను ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలి….. టిఆర్ యస్ అధినేత కవిత డిమాండ్ ……

కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నపలంగా ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కవిత డిమాండ్ చేశారు.

ఆమె శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో మాట్లాడారు పవన్ ఎలాగో తాను ఆక్రమించాననని అనుకుంటే వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని పవన్ అన్నారని, ఈ చెరువు శిఖం భూమి అని ఇరిగేషన్ రికార్డులు స్పష్టంగా చెబుతున్నారని అందువల్ల వెంటనే పవన్ కల్యాణ్ ఆ భూమిని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి అక్కడ వేసిన కంటెను, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.

కోడి చెరువులో భూమిని పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అనేక తప్పిదాలు దొర్లాయని ఇందులో 3 ఎకరాలు మాత్రమే శిఖం భూమి అని మిగతా 7 ఎకరాలు మాగాణి అని రాశారని కానీ ఇరిగేషన్ రికార్డుల ప్రకారం ఈ 10 ఎకరాలు శిఖం భూమి అని స్పష్టంగా ఉందని దీనిపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments