హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసులు శుక్రవారం రాత్రి నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఈ ఆకస్మిక తనిఖీల్లో సుమారు 5 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.
ఓయో రూమ్స్, లాడ్జీలు, బడ్జెట్ హోటళ్లు మరియు అనుమానాస్పద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.హోటల్ యజమానులు నిర్వహిస్తున్న రిజిస్టర్లను, కస్టమర్ల గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించారు. హోటళ్లలో సీసీటీవీ కెమెరాల పనితీరును, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు.
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా లేదా అనే కోణంలో ఆరా తీశారు. మలక్‌పేట్ డివిజన్ పోలీసులు హోటళ్లు, లాడ్జీలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని 13 లాడ్జీలు, హోటళ్లలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా అతిథుల గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డులు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ వివరాలు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతకు సంబంధించిన ఇతర రికార్డులను అధికారులు పరిశీలించారు.
వసతి గృహాలను నేరస్థులు లేదా అనుమానాస్పద వ్యక్తులు దుర్వినియోగం చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు..చట్టపరమైన చర్యలు తప్పవు..ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి
హోటల్, లాడ్జీల యాజమాన్యాలు ప్రతి అతిథి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, గుర్తింపు పత్రాలను ధృవీకరించిన తర్వాతే గదులు కేటాయించాలని సూచించారు. అలాగే సీసీటీవీ కెమెరాలను నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మలక్‌పేట్ ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేసే హోటళ్లు, లాడ్జీలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం కోసం పోలీసు శాఖ చేపడుతున్న చర్యలకు హోటల్ యాజమాన్యాలు, ప్రజలు సహకరించాలని
