ఢిల్లీలో శనివారం కాక్రోచ్ జనతా పార్టీ నిరసన కార్యక్రమానికి దిగింది ఈ ఆందోళన లో పాల్గొనేందుకు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దిప్కే యూఎస్ నుంచి శనివారం ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా జంతర్మంతర్లో నిరసనలు చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతిచ్చారని సీజేపీ ప్రకటించింది. శాంతియుతంగా నిరసన చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసనలకు అనుమతిపై తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని పోలీసులు చెబుతున్నారు. నీట్ (NEET),సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల లీకేజీల వ్యవహారంపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఈ నిరసనకుదిగింది .
ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని నిరసన వేదిక జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు కాక్రోచ్ పార్టీ సన్నద్ధమైంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసన పిలుపుతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) అప్రమత్తమైంది.
జంతర్ మంతర్ వద్ద ఈ సభ జరిగితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కాక్రోచ్ పార్టీ (సీజేపీ) ప్రతిపాదిత సభకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినప్పటికీ నిరసనకారులు తరలివచ్చే అవకాశం ఉండటంతో జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాలను పోలీసులు తమ పూర్తి నిఘా నీడలోకి తీసుకువచ్చారు. అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
పుస్తకాలు, తిరంగాతో రండి …. అభిజీత్ పిలుపు
ఢిల్లీ లో జరిగే నిరసన కు పుస్తకాలు …జాతీయ జెండాలు చేతులో పట్టుకొని రావాలని ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అభిజీత్ దిప్కే సోషల్ మీడియా వేదికగా తన మద్దతుదారులకు, విద్యార్థులలు పిలుపు నిచ్చారు . ఈ నిరసనను పూర్తిగా శాంతియుతంగా, ఒక నూతన పంథాలో నిర్వహించాలని ఆయన కోరారు.
“నేను ఢిల్లీ చేరుకున్నాను. జంతర్ మంతర్ వద్ద మీ అందరినీ కలవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మీతో పాటు ఒక పుస్తకాన్ని, మన మువ్వెన్నెల జాతీయ జెండాను తీసుకురావడం మర్చిపోకండి.
అంతేకాకుండా శాంతికి, కృతజ్ఞతకు ప్రతీకగా అక్కడ విధుల్లో ఉండే పోలీసులకు పూలు ఇవ్వండి. ఈ ఉద్యమాన్ని మనం ప్రేమాభిమానాలతో, శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
